సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం సినీ హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ దర్శించుకున్నారు. తాము నటించిన బైకర్ సినిమా విజయవంతం కావాలని స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్తంభానికి మొక్కుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అందజేశారు.
కప్పస్తంభానికి మొక్కుకుంటున్న హీరో శర్వానంద్,
హీరోయిన్ మాళవిక నాయర్


