తిరుమలనగర్‌కు వరల్డ్‌ వాటర్‌ డైజస్ట్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

తిరుమలనగర్‌కు వరల్డ్‌ వాటర్‌ డైజస్ట్‌ అవార్డు

Mar 25 2026 6:50 AM | Updated on Mar 25 2026 6:50 AM

కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87వ వార్డులోని తిరుమలనగర్‌కు ప్రతిష్టాత్మక ‘వరల్డ్‌ వాటర్‌ డైజస్ట్‌’అవార్డు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్‌.పాటిల్‌ చేతుల మీదుగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జల సంరక్షణకు విశేష కృషి చేస్తున్న కాలనీల్లో ఒకటిగా తిరుమలనగర్‌ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. కాలనీలో ఇంకుడు గుంతల ఏర్పాటు, తాగునీరు వృథా కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను గుర్తించిన కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు పరమానంద, విశ్వేశ్వరరావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజభూషణ్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement