ఆర్కే బీచ్‌లో సరికొత్త అందం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బీచ్‌రోడ్‌లో నగరంలోని 14వ కేఎఫ్‌సీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేఎఫ్‌సీ బకెట్ సైకత శిల్పం సందర్శకులను కట్టిపడేస్తోంది. ప్రముఖ సైకత శిల్పి అకునూరు బాలాజీ వరప్రసాద్ దాదాపు 48 గంటలపాటు శ్రమించి, 7 టన్నులకు పైగా సముద్రపు ఇసుకతో ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు. ఇసుకలోంచి ఉద్భవించినట్లుగా ఉన్న ఈ బకెట్ వద్ద పర్యాటకులు ఉత్సాహంగా ఫొటోలు, రీల్స్ తీసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కేవలం సైకత శిల్పమే కాకుండా.. విశాఖ నేపథ్యానికి తగ్గట్లుగా కొత్త రెస్టారెంట్‌ను నౌక శైలిలో తీర్చిదిద్దడం మరో ఆకర్షణ. ఆకట్టుకునే వెదురు ముఖద్వారంతో, ఒకేసారి 70 మంది కూర్చుని సముద్రపు అందాలను వీక్షిస్తూ భోజనం చేసేలా ఈ సరికొత్త కేఎఫ్‌సీ పర్యాటకులకు విందుతో పాటు కనువిందును కూడా పంచుతోంది.
– ఏయూ క్యాంపస్


