ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలకు ఆధునిక పరికరాలు | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలకు ఆధునిక పరికరాలు

Mar 25 2026 6:50 AM | Updated on Mar 25 2026 6:50 AM

మహారాణిపేట: కేజీహెచ్‌ గుండె శస్త్రచికిత్స విభాగంలోని కొత్త పరికరాలు చేరాయి. కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగంలో అత్యాధునిక హార్ట్‌ లంగ్‌ మెషీన్‌, హీమోథెర్మ్‌(టెంపరేచర్‌ కంట్రోల్‌ యూనిట్‌) పరికరాలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. సుమారు రూ.2కోట్ల విలువైన ఈ పరికరాలను ఐసీఐసీఐ ఫౌండేషన్‌ తమ సీఎస్సార్‌ నిధులతో కేజీహెచ్‌కు విరాళంగా అందించింది. ఈ నూతన పరికరాలతో కేజీహెచ్‌లో క్లిష్టమైన ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సలను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కలుగుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.ఎస్‌.ఎం.సంధ్యాదేవి, కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ మణీత, తదితరులు పాల్గొన్నారు. ఐసీఐసీఐ ఫౌండేషన్‌ నుంచి శివ కుమార్‌ చిట్టిపోలు, శ్రీవర్ధన్‌ బొబేపల్లి, పక్కి వెంకట సాయి శంకర్‌, ఎం. రాజనీకాంత్‌ రెడ్డి, సురేంద్ర పురోహిత్‌ తదితరులు హాజరయ్యారు.

సమకూర్చిన ఐసీఐసీఐ ఫౌండేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement