ఆకట్టుకునేలా ‘యోగాంధ్ర మెమోరియల్‌’ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునేలా ‘యోగాంధ్ర మెమోరియల్‌’

Mar 25 2026 6:50 AM | Updated on Mar 25 2026 6:50 AM

ఏయూక్యాంపస్‌: ప్రజల ఆరోగ్యానికి ప్రతీకగా, యోగాకు విశిష్ట గుర్తింపుగా యోగాంధ్ర మెమోరియల్‌ నిలుస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బీచ్‌ రోడ్‌లోని యోగా విలేజ్‌ వద్ద నూతనంగా నిర్మించిన యోగాంధ్ర మెమోరియల్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ప్రధానమంత్రి సందర్శించిన ఈ ప్రాంతానికి గుర్తుగా, ఆరోగ్య ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ యోగా చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా.. జీవీఎంసీ ఆధ్వర్యంలో యోగా విలేజ్‌ సమీపంలో సుమారు రూ.69.55 లక్షల అంచనా వ్యయంతో ఈ మెమోరియల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పింక్‌ శాండ్‌స్టోన్‌తో మెమోరియల్‌ నిర్మాణంతో పాటు ఆకట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మనాభం ప్రాంతానికి చెందిన ఓ యోగా క్రీడాకారిణి ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్‌ రాజు, కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌, జీవీఎంసీ ఏడీసీలు రమణ మూర్తి, సత్యవేణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement