తలనీలాల ద్వారా రూ.15.55 కోట్ల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

తలనీలాల ద్వారా రూ.15.55 కోట్ల ఆదాయం

Mar 25 2026 6:50 AM | Updated on Mar 25 2026 6:50 AM

సింహగిరిపై తలనీలాల వేలం నిర్వహణ

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి తలనీలాల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 2026–27 సంవత్సరానికి గాను రూ.15 కోట్లు 55 లక్షల 50 వేలు వచ్చింది. దేవస్థానంలో ఏడాది కాలపరిమితికి గాను తలనీలాల ద్వారా ఇంతపెద్ద మొత్తంలో రావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రెండేళ్ల కాలపరిమితికి తలనీలాలను సేకరించే హక్కులను కేటాయించేందుకు మంగళవారం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో బహిరంగ వేలం, సీల్డ్‌ టెండర్‌ ప్రక్రియ నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ‘దురై ఎంటర్‌ప్రైజెస్‌’ సంస్థ షీల్డ్‌ టెండర్‌ ద్వారా ఈ హక్కును దక్కించుకుంది. ఈ ఒప్పందం 2026 ఏప్రిల్‌ 1 నుంచి 2028 మార్చి 31 వరకు (రెండేళ్ల పాటు) అమల్లో ఉంటుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తలనీలాల ఆదాయం రూ.10.13 కోట్లుగా ఉండగా, ఈసారి అది దాదాపు 50 శాతం పైగా పెరగడం విశేషం. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఏఈవోలు రమణమూర్తి, రమేష్‌బాబు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement