మొదలైన నామినేషన్ల పర్వం
విశాఖ లీగల్ : నగర న్యాయవాదుల సంఘం ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఎన్నికల అధికారి ఏ. ప్రభాకర్ రెడ్డికి పలువురు అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను దాఖ లు చేశారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది శిష్ష్లా శ్రీనివాసమూర్తి (వాసు) అధ్యక్ష పదవికి తొలి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నానని, తోటి న్యాయవాదులందరూ సహకరించాలని కోరారు. శ్రీనివాసమూర్తితో పాటు కార్యదర్శి పదవికి ఒమ్మి వెంకట సుధాకర్, మహిళా ప్రతినిధిగా పీలా మహాలక్ష్మి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కోర్టు ఆవరణలో ఎన్నికల సందడి నెలకొంది.


