‘మలబార్‌’లో శృతిహాసన్‌ మెరుపులు | - | Sakshi
Sakshi News home page

‘మలబార్‌’లో శృతిహాసన్‌ మెరుపులు

Mar 24 2026 6:49 AM | Updated on Mar 24 2026 6:49 AM

బీచ్‌రోడ్‌: నగరంలోని వీఐపీ రోడ్డులో ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ నూతనంగా ఏర్పాటు చేసిన భారీ షోరూంను సోమవారం సినీ నటి శృతి హాసన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతి హాసన్‌ మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన, నమ్మకమైన బంగారు, వజ్రాభరణాలకు మలబార్‌ సంస్థ పెట్టింది పేరన్నారు. విశాఖ వంటి కీలక మార్కెట్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, సంప్రదాయ, ఆధునిక డిజైన్ల కలయికతో ఈ అతిపెద్ద షోరూంను అందుబాటులోకి తీసుకురావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సంస్థ ఇండియా ఆపరేషన్స్‌ హెడ్‌ ఆషీర్‌ మాట్లాడుతూ.. విశాఖ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక కలెక్షన్లను ప్రదర్శిస్తున్నామన్నారు. ప్రస్తుతం షోరూంలో ‘బిగ్‌ బ్రిలియంట్‌ సేల్‌’ నడుస్తోందని, ఇందులో భాగంగా బంగారం, అన్‌కట్‌ రత్నాల ఆభరణాల తరుగుపై 40శాతం, వజ్రాల విలువపై 30శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. పాత బంగారం మార్పిడిపై ఎటువంటి తరుగు లేకుండా గరిష్ట విలువను అందిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో మలబార్‌ ప్రతినిధులు సిరాజ్‌, రాకేష్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement