చందనోత్సవానికి పక్కాగా వైద్య ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

చందనోత్సవానికి పక్కాగా వైద్య ఏర్పాట్లు

Mar 24 2026 6:49 AM | Updated on Mar 24 2026 6:49 AM

మహారాణిపేట: వచ్చే నెల 20న జరగనున్న సింహాచలం చందనోత్సవానికి పటిష్టమైన వైద్య ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు తెలిపారు. సోమవారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవం కోసం మూడు షిఫ్టుల్లో 304 మంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 90 అంబులెన్సులు, కొండపై 6 పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సేవల కోసం అపోలో, కేజీహెచ్‌, విక్టోరియా ఆస్పత్రులను రెఫరల్‌ ఆస్పత్రులుగా గుర్తించామన్నారు. ఈ ఏర్పాట్లకు ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో నోడల్‌ అధికారి డాక్టర్‌ ఉమావతి, ఎన్టీఆర్‌ వైద్యసేవ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement