తాటిచెట్లపాలెం: నగరంలోని సాలగ్రామపురంలో నిర్మించిన ‘ఇనార్బిట్ మాల్’ సోమవారం గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు ఆదివారం ఉన్నతాధికారులతో కలిసి మాల్ ను సందర్శించారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో జరుగుతున్న తుది దశ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో, అత్యంత ఆధునిక హంగులతో రూపొందిన ఈ మాల్ నగరానికి సరికొత్త ల్యాండ్‌మార్క్‌గా నిలవనుంది. పోర్ట్ స్థలంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుండటంతో సందర్శకులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోద అను భూతి కలగనుంది. చైర్మన్ పర్యటనలో పోర్ట్, మాల్ ప్రతినిధులు పాల్గొని ఏర్పాట్ల గురించి వివరించారు.


