వేసవి సవాళ్లకు వాల్తేర్‌ డివిజన్‌ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వేసవి సవాళ్లకు వాల్తేర్‌ డివిజన్‌ సిద్ధం

Mar 22 2026 1:25 AM | Updated on Mar 22 2026 1:25 AM

తాటిచెట్లపాలెం: ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో, రైల్వే ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం వాల్తేర్‌ డివిజన్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శనివారం డీఆర్‌ఎం కార్యాలయంలో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌బోహ్రా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాల్తేర్‌ డివిజన్‌ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, దువ్వాడ, రాయగడ, కోరాపుట్‌, జగదల్‌పూర్‌ వంటి చోట్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం ప్రత్యేక మంచినీటి బూత్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సివిల్‌ డిఫెన్స్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ప్రయాణికులకు నీటి సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు. రైల్వే స్టేషన్‌లలోని మరుగుదొడ్లు, వెయిటింగ్‌ హాల్స్‌లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటికప్పుడు అనౌన్స్‌మెంట్‌ ద్వారా ప్రయాణికులకు చేరవేయాలని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్పీఎఫ్‌, జీఆర్పీ, రైల్వే కమర్షియల్‌ సిబ్బంది సమన్వయంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఆపద వేళల్లో ప్రయాణికులను ఎలా రక్షించాలో వివరిస్తూ రైల్వే సిబ్బంది మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement