ఎంవీపీకాలనీ: గాదిరాజు ప్యాలెస్ వేదికగా ‘రెడ్‌కార్పెట్ బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్’ శనివారం ప్రారంభమైంది. పలువురు నగర మహిళా పారిశ్రామికవేత్తలు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆర్.కె. నాయుడు, శైలజా రామ్ మాట్లాడుతూ విశాఖలో ఇది అతిపెద్ద గోల్డ్ , డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో బంగారం, వజ్రాలతో పాటు పోల్కి, జేమ్స్ వంటి ఆభరణాలకు సంబంధించి 30కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. తొలిరోజే ఈ ఎగ్జిబిషన్‌కు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. సోమవారం వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.


