విశాఖ సిటీ: వీఎంఆర్‌డీఏ కార్యాలయం, చిల్డ్రన్స్ ఎరినా, గురజాడ కళాక్షేత్రంకు వచ్చే సందర్శకులకు రక్షిత తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్‌లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు సామాజిక సేవా కార్యక్రమం(సీఎస్‌ఆర్)లో భాగంగా ఒక్కో ప్లాంట్ రూ.8 లక్షలతో అందుబాటులోకి తీసుకువచ్చిన దివీస్ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.


