కొమ్మాది: నేవల్ డాక్‌యార్డ్ ఎస్‌ఏఎక్స్ విభాగం సీఐటీయూ నాయకుడు, ఎండాడ నివాసి జ్యేష్ట వెంకటేశ్వరరావు శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వరరావు మృతికి సీపీఎం విశాఖ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కార్మిక వర్గ ప్రయోజనాల కోసం చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. కాగా, వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని ఆంధ్రా మెడికల్ కళాశాలకు అప్పగిస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కళాశాల అధికారులకు దేహాన్ని అప్పగించారు.


