సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని జమ్మూకశ్మీర్ అండ్ లద్దాఖ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పరిహార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజ చేసి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఆయనకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు.
26న వాహనాల ఈ–వేలం
మహారాణిపేట: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నిరుపయోగంగా ఉన్న పలు వాహనాలను ఈనెల 26వ తేదీన ఈ–వేలం వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. మొత్తం 20 వాహనాలను ఈ వేలం ప్రక్రియ ద్వారా విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ https://konugolu.ap.gov.inలో పొందుపరిచామని వివరించారు. ఆసక్తి గల వారు వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.


