మహారాణిపేట : పరాభవ నామ సంవత్సరంలోనైనా కూటమి ప్రభుత్వ పాలకుల అహంకారం తగ్గి, ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ పరాభవ సంవత్సరంలోనైనా కూటమి ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే జ్ఞానాన్ని పాలకులకు భగవంతుడు ప్రసాదించాలని, శ్రీవేంకటేశ్వర స్వామి కటాక్షం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కె.సతీష్, నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాస్, పేడాడ రమణికుమారి, ముఖ్యనేతలు పేర్ల విజయచంద్ర, పీలా వెంకట లక్ష్మి, తాడి జగన్నాథ రెడ్డి, అల్లు శంకర్ రావు, కటారి అనిల్‌రాజు, అల్లంపల్లి రాజబాబు, ద్రోణంరాజు శ్రీవాత్సవ, పీవీ సురేష్, శశికళ, సాడి పద్మారెడ్డి , బిపిన్ కుమార్‌జైన్, అంబటి శైలేష్, శ్రీదేవి వర్మ, బొండా ఉమామహేశ్వరరావు, ప్రసాద్, జీలకర్ర నాగేంద్ర, బొంగవల్లి గోవింద్, తదితరులు పాల్గొన్నారు.


