చంద్రబాబువి డైవర్షన్‌ పాలిటిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి డైవర్షన్‌ పాలిటిక్స్‌

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

చంద్రబాబువి డైవర్షన్‌ పాలిటిక్స్‌

చంద్రబాబువి డైవర్షన్‌ పాలిటిక్స్‌

8లో

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

తిరుమల లడ్డూపై సిట్‌ చార్జిషీట్‌, గీతం భూదోపిడీతో ఇరకాటంలో ప్రభుత్వం

వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు

లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఫ్లెక్లీలు ఏర్పాటు చేసికవ్వింపు చర్యలు

చంద్రబాబు ప్రభుత్వం ఆరాచకాలపై పోలీసులకు వైఎస్సార్‌ సీపీ ఫిర్యాదు

తాటిచెట్లపాలెం: తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం చేస్తూ విశాఖలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆధ్వర్యంలో ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నాయకులు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో రూ. 5 వేల కోట్ల భూములను గీతం సంస్థకు కట్టబెట్టడంపై తాము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే టిడిపి ఈ కుట్రలకు పాల్పడుతోందని, సనాతన ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఈ విష ప్రచారంపై ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నించారు.

లడ్డూ ఆరోపణలు రాజకీయ కుట్రే : కేకే రాజు

తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని సీబీఐ చార్జీషీట్‌, సిట్‌ నివేదికలతో స్పష్టమైందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జంతువుల కొవ్వు కలిసిందంటూ భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం దారుణమన్నారు. తమ అబద్ధాలు బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్‌ సీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తూ, ప్రశ్నించే గొంతుకలను కేసులతో నొక్కేస్తున్నారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో అక్రమంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి : ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం చూస్తుంటే మనం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై పెట్రోల్‌ బాంబులతో దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఆయనను అంతం చేసే కుట్రలా కనిపిస్తోందని ఆరోపించారు. లడ్డూ వివాదంలో పన్నిన కుట్రలు బయటపడటం, గీతం సంస్థకు భూముల కేటాయింపు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలే స్వయంగా దాడుల్లో పాల్గొంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందున, గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్‌ రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, ఎస్‌ఈసీ సభ్యులు రొంగలి జగన్నాథం, రాష్ట్ర సంయక్త కార్యదర్శి కిరణ్‌రాజు, తాడి జగన్నాథ్‌రెడ్డి, పల్లా దుర్గారావు రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షులు జీవీ రవిరాజు, మాజీ చైర్మన్లు అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, జోనల్‌ అనుబంధ అధ్యక్షులు పీవీ సురేష్‌, ఎం.సునీల్‌కుమార్‌, సేనాపతి అప్పారావు, జిల్లా అనుబంధ అధ్యక్షులు బర్కత్‌ ఆలీ, బోని శివరామకృష్ణ, రాయపురెడ్డి అనిల్‌కుమార్‌, కర్రి రామారెడ్డి, పీలా ప్రేమ్‌కిరణ్‌ జగదీష్‌, దేవరకొండ మార్కండేయులు, బొండా ఉమామహేశ్వర్రావు, కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, సాడి పద్మారెడ్డి, రెయ్యి వెంకటరమణ, కేవీఎన్‌ శశికళ, వార్డు అధ్యక్షుల చొల్లంగి నాగేశ్వర్రావు, భీశెట్టి విలియం ప్రసాద్‌, జక్కంపూడి సత్యనారాయణ, పైడిరమణ, బి.గోవింద్‌రాజు, డొప్ప శ్రీను, లాలం వేణు, గొపాలస్వామి, మెట్ట దమయంతి, యర్రంశెట్టి శ్రీనివాస్‌, గొడేసి శ్రీనివాసరెడ్డి, బొడ్డ గొవింద్‌, పార్టీ నాయకులు విక్టర్‌, రామన్నపాత్రుడు, దుళ్ల రామకృష్ణరెడ్డి, బొట్టా రాజు, పద్మశేఖర్‌, సుశీల, గంగామహేష్‌, గాలిప్రసాద్‌, బొడ్డేటి కిరణ్‌, మువ్వలసంతోష్‌, లక్ష్మణరావు, షేక్‌ బాబ్జీ, బంగారు భవాని శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద్ధపు ఫ్లెక్సీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement