ఉక్కు అధికారుల సంఘం ఎన్నికలు ప్రశాంతం
ఉక్కునగరం: ఉక్కు అధికారుల సంఘం (సీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియడంతో కొత్త కమిటీ నియామకం కోసం ఎన్నికలు నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ టౌన్ అడ్మిన్ విభాగాధిపతి జె.రాహుల్ ఎన్నికల అధికారిగా ఎన్నికలు నిర్వహించారు. ఆయన పర్యవేక్షణలో సీ భవన్‌లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సీ సభ్యులు 2,300 మంది కాగా 1,538 మంది సభ్యులు ఓటు వేశారు. 50 మంది సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.


