సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి
ప్రస్తుతం ఏ శుభకార్యాలైనా, జాతర్లు అయినా కోలాటం, చెట్టు భజనలు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. అంతటి ప్రాచుర్యం పొందుతున్న కోలాటం, చెట్టు భజన కళాకారులకు శిక్షణ ఇవ్వడానికి, సాధన చేయడానికి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు. కళారంగంపై ఉన్న ఇష్టంతో ఉచితంగా బాలలకు శిక్షణ ఇస్తున్నాం. పాశ్చాత్య సంగీతం, నృత్యాలతో విసుగెత్తి ఉన్న ప్రజలకు నేడు ఆనందం, ఉత్సాహం, సంతోషం, వినోదాన్ని మెండుగా ఇచ్చే కళలను ప్రోత్సహించాలి.
–విందుల నరసింహనాయుడు, కోలాట గురువు


