ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌కి దరఖాస్తు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌కి దరఖాస్తు చేయాలి

Nov 29 2025 6:49 AM | Updated on Nov 29 2025 6:49 AM

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌కి దరఖాస్తు చేయాలి

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌కి దరఖాస్తు చేయాలి

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న కళాశాలలు నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)కు దరఖాస్తు చేయాలని ఏయు వైస్‌ చాన్సలర్‌ ఆచార్య జి.పి రాజశేఖర్‌ అన్నారు. శుక్రవారం ఏయు కన్వెన్షన్‌ సెంటలో ఉన్నత విద్య మండలి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల, కళాశాలల ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ సమన్వయకర్తలకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సమాచారాన్ని కలిగి ఉండడం ఎంతో అవసరమని, వివిధ ర్యాంకింగ్‌లకు దరఖాస్తు చేసే విషయంలో ఈ సమాచారం కీలకంగా నిలుస్తుందన్నారు. అనుబంధ కళాశాలలను బలోపేతం చేసే విధంగా సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య ఎస్‌.విజయభాస్కరరావు మాట్లాడుతూ జాతీయ సగటుతో సమానంగాను, అంతకంటే ఎక్కువగా రాష్ట్ర సగటు ఉండాలని సూచించారు. త్వరలో విశ్వవిద్యాలయాలన్నింటికి ఒకే విధమైన రీసెర్చ్‌ మెథడాలజీ శిక్షణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఉన్నత విద్యా మండలి అధికారి డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో పాటు కళాశాలలు సైతం పెద్ద శంఖ్యలో దరఖాస్తు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ జయభాస్కర రావు, డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement