విశాఖ అభివృద్ధికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

విశాఖ అభివృద్ధికి పెద్దపీట

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

● బడ్జెట్‌ విశేషాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ● ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి

మహారాణిపేట: రాష్ట్ర బడ్జెట్‌ విశేషాలు, రంగాల వారీ కేటాయింపులను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం బడ్జెట్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించి, వారి ద్వారా బడ్జెట్‌పై అవగాహన శిబిరాలు ఏర్పాటు చే యాలని మంత్రి సూచించారు. నియోజకవర్గాల వారీ కేటాయింపులపై ప్రత్యేక పీపీటీలు, బుక్‌లెట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులు, నిధుల వివరాలను ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌(వీఈఆర్‌) అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి.. ఇటీవల ఆర్సెల్లార్‌ మిట్టల్‌ సంస్థకు శంకుస్థాపన జరిగిందని, త్వరలోనే గూగుల్‌ సంస్థకు కూడా శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు. కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో విశాఖ జిల్లాకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. వీఈఆర్‌ రీజియన్‌ కోసం రూపొందించిన 49 ప్రాజెక్టుల్లో 17 ప్రాజెక్టులు విశాఖలోనే రాబోతున్నాయని తెలిపారు. సాస్కి నిధులతో జిల్లాలో మూ డు వర్కింగ్‌ వుమెన్‌ హాస్టళ్లను నిర్మిస్తున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్‌ రాజు, వంశీకృష్ణ తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబత్ర బాగ్చి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లు కేతన్‌ గార్గ్‌, తేజ్‌ భరత్‌, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో సంగీత్‌ మాధుర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement