మహారాణిపేట: విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. కలెక్టర్ బదిలీ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యేలు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 20 నెలల కాలంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలను కలెక్టర్ సమన్వయంతో విజయవంతం చేశారని కితాబిచ్చారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. తన విధి నిర్వహణలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లు కేతన్ గార్గ్, తేజ్ భరత్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు.
ఇన్‌చార్జి మంత్రి డోలా


