ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
డాబాగార్డెన్స్: రోజూ యూనిఫాంతో తరగతులకు హాజరయ్యే విద్యార్థినులు సీతాకోక చిలుకల్ని మరిపించారు. చదువులోనే కాదు.. ఆటపాటల్లోనూ అందెవేసిన చేయంటూ ఉత్సాహానికే ఊపుతెచ్చారు. నగరంలోని సౌత్ జైల్ రోడ్డులో ఉన్న విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఆద్యంతం ఉత్సాహాన్ని నింపాయి. నూతన బ్యాచ్ విద్యార్థులను స్వాగతిస్తూ సీనియర్ విద్యార్థులు నిర్వహించిన ఈ వేడుక ఆనందంగా సాగింది. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మజ్జి భారతి పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మంజుల కళాశాల ప్రగతి, చరిత్రను వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఫ్రెషర్స్‌ను స్వాగతించడానికి సీనియర్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉల్లాసభరితంగా సాగాయి.
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..


