సత్యదేవునికి భక్త నీరాజనం
పెద్ద ఎత్తున పౌర్ణమి పూజలు, వ్రతాలు
డాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ(బాబాజీకొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధన చేశారు. వేకువ జామున 2 గంటలకు ధ్వజస్తంభ పూజ నిర్వహించారు. వేకువజాము 2.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు స్వామి దర్శనం కల్పించారు. రూ.1,116 చెల్లించిన భక్తులతో అనివెట్టి మండపంలో ఉదయం 7 గంటలకు, 10.30 గంటలకు ప్రత్యేక వ్రతాలు చేయించారు. ఉదయం 4 గంటలకు, 6 గంటలకు, 9 గంటలకు సామూహిక వ్రతాలు జరిగాయి. భక్తుల తాకిడి దృష్ట్యా ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు అవకాశం కల్పించలేదని ఈవో రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పూర్ణామార్కెట్ దరి దయారామ స్వీట్ షాప్ పక్క నుంచి ఆలయానికి ఏర్పాటు చేసిన ఘాట్ రోడ్డును భక్తులు సద్వినియోగం చేసుకున్నారు.
సత్యదేవునికి భక్త నీరాజనం
సత్యదేవునికి భక్త నీరాజనం


