మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య
పీఎంపాలెం: తల్లి మందలించిందని మనస్తాపం చెందిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వివరాలను పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 7వ వార్డులోని చంద్రంపాలేనికి చెందిన జి.మోజేస్ (16) 10వ తరగతి ఫెయిలయ్యాడు. స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. దీంతో అతని తల్లి మంగళవారం రాత్రి బాలుడిని మందలించింది. చెడు తిరుగుళ్లు వద్దని, మంచి మార్గంలో ఉండాలని సూచించింది. దీనిని అవమానంగా భావించిన మోజేస్.. తీవ్ర మనస్తాపంతో తమ ఇంటి డాబాపై గల షెడ్‌లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి తండ్రి గేదెల వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


