జాతీయ బాక్సింగ్ పోటీల్లో విశాఖ విద్యార్థులకు పతకాలు
సాక్షి, అమరావతి : అరుణాచల్‌ప్రదేశ్‌లో బుధవారం జరిగిన 69వ జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు బాక్సర్లు 3 కాంస్య పతకాలను సాధించారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థి కొలుసు సాయి లోహిత్, ద్వారకానగర్‌లోని బీవీకే జూనియర్ కాలేజీ విద్యార్థి వేగి రాహుల్, వాల్తేరు కేంద్రీయ విద్యాలయానికి చెందిన బోస ఈశ్వర్ చరణ్ రెడ్డి ఈ ఘనత సాధించారన్నారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు క్రీడాకారులను అభినందించారు.


