హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
ఆర్చిడ్ స్పా సెంటర్‌పై
పోలీసుల దాడి
బీచ్‌రోడ్డు: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్‌లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాలు(వ్యభిచారం) నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్‌లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్‌కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్‌పై కేసు నమోదు చేసి, యజమానులు ఏ1గా కాసిరెడ్డి అరుణ్ కుమార్ (పరారీలో), ఏ2గా రాహుల్ (పరారీలో), సిబ్బంది ఏ3గా కల్లూరు పవన్ కుమార్, ఏ4గా జానా శ్రీనివాస, విటుడు ఏ5గా చీలి రామచంద్ర ప్రసాద్‌లను పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


