కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం
మధురవాడ: నగరంలో చోటుచేసుక్ను సమతా కాలేజీ విద్యార్థి ఆత్మహత్య సంఘటన మరువక ముందే మధురవాడలో ఓ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కారణంగా విద్యార్థి అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం గారే నందిగాం ప్రాంతానికి చెందిన పోతిన సుమంత్(17)మారికవలస భగీరథ క్యాంపస్ చైత్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన సుమంత్‌ను సాయంత్రం చూడ్డానికి వచ్చిన తండ్రికి.. మీ కుమారుడు కనిపించట్లేదంటూ.. యాజమాన్యం చెప్పిన వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. వెంటనే విద్యార్థి బంధువులు పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా కాలేజీ సమీంలోని మెట్రోమాల్ గోడపై దాగిఉన్న సుమంత్‌ను గుర్తించి, బంధువులు కాపాడి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే.. కళాశాలలో ఉండాల్సిన విద్యార్థి బయటకు రాగలిగాడని, కాలేజీకి వెళ్లే వరకూ తమకు ఆ విషయం చెప్పకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థి మిస్సింగ్‌ను గమనించని
శ్రీచైతన్య యాజమాన్యం


