ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణంపై సర్వే
భీమునిపట్నం : బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం ఎంతవరకు ఉందన్న దానిపై సోమవారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారితో కలిసి ఆర్డీవో సంగీత్ మాథూర్ పర్యవేక్షణలో అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతంలో మొత్తం 1,400 ఎకరాల మేరకు ఎర్రమట్టి దిబ్బలు విస్తీర్ణం ఉండగా ఇప్పుడు ఏవిధంగా ఉన్నాయి.. వాటి సరిహద్దులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. ఈ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో ఎర్రమట్టిదిబ్బల సరిహద్దులు గుర్తించడం వల్ల.. ఇకపై వీటిని కూల్చివేత జరగకుండా అధికారులు తగిన చర్యలను తీసుకోవడానికి వీలవుతుంది. ఇందులో తహసీల్దారు రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


