విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
మహారాణిపేట: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి, సమాజ సేవకు అంకితం కావాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆకాంక్షించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సోమవారం వైద్య విద్యార్థుల ‘ఫ్రెషర్స్ డే’ ఉల్లాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఫ్రెషర్స్ డే విద్యార్థులకు కొత్త విద్యా ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వైద్య విద్యార్థులు బాధ్యత, సేవ, సమగ్రతతో కూడిన విలువలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలన్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్‌ఎం సంధ్యాదేవి మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో కరుణ, క్రమశిక్షణ, విద్యా నైపుణ్యం విలువలను తప్పక నిలబెట్టుకోవాలని కోరారు. ఈ వేడుక సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రముఖులను ఘనంగా సన్మానించారు. అలాగే అధ్యాపకులకు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ప్రత్యేకంగా 25వ బ్యాచ్‌కు చెందిన 250 మంది కొత్త విద్యార్థులకు స్వాగతం పలికే విధంగా ప్రత్యేక బహుమతులు అందజేశారు. చివరగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, ఏఎంసీ వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. మన్మథరరావు, డాక్టర్ వి. రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎ. కృష్ణవేణి, సాంస్కృతిక ఉపాధ్యక్షురాలు డాక్టర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్


