అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం
సీతంపేట: విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయం, రీజినల్ కార్యాలయం, విశాఖపట్నం సిబ్బంది ఆధ్వర్యంలో ద్వారకానగర్‌లో ఆదివారం విజిథాన్(వాక్‌థాన్) జరిగింది. జోనల్ హెడ్ శాలిని మెనన్, రీజినల్ హెడ్ జె.సింహాచలం, జోనల్ విజిలెన్స్ ఆఫీసర్ ఐ.వి.కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వాక్‌థాన్‌లో పెద్ద సంఖ్యలో బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ శాలిని మెనన్ మాట్లాడుతూ సిబ్బందితో పాటు ప్రజల్లో నిజాయతీ, పారదర్శకత, నైతిక విలువల పట్ల అవగాహన కల్పించడం ఈ విజిథాన్ ప్రధాన ఉద్దేశమన్నారు. వృత్తిపరమైన జీవితంలోనే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో కూడా నిజాయతీ చాలా ముఖ్యమన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.


