యువ దంపతుల ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి వాసు అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్‌మార్కెట్ సమీపంలో ఉంటున్నారు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ప్రస్తుతం అనిత ఏడో నెల గర్భిణి. ఏం జరిగిందో తెలీదుగానీ ఆదివారం వీరిద్దరూ విగతజీవులయ్యారు. వాసు ఫ్యాన్ హుక్‌కు ఉరేసుకుని చనిపోగా, అనిత మంచం మీద చనిపోయి ఉంది. ఉదయం వాసు తల్లి ఫంక్షన్ నిమిత్తం బయటకెళ్లి సాయంత్రం తిరిగొచ్చింది. తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటీకిలో నుంచి చూసి నిర్ఘాంతపోయింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మరణించి కనిపించడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా వాసు, అనితల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మరోవైపు.. అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. ఫోర్త్‌టౌన్ సీఐ ఉమాకాంత్ వివరాలు సేకరిస్తున్నారు.
యువ దంపతుల ఆత్మహత్య


