తీరం చెంత సరదా లోకం
నగరంలో వుడా పార్కు అంటే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. ఆర్కే బీచ్ పక్కన సముద్రం ఒడ్డున ఉన్న ఈ పార్కులో పిల్లల కోసం ప్రత్యేకమైన ఆట పరికరాలు, స్కేటింగ్ రింగ్, పచ్చని మైదానాలు, వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ బోటింగ్, యోగా కేంద్రాలు కూడా ప్రత్యేక ఆకర్షణలు. వనభోజనాలకు వచ్చే వారు రోజంతా ఇక్కడ సరదాగా గడపవచ్చు. ఈ పార్కులో ప్రవేశానికి పెద్దలకు రూ. 20, పిల్లలకు రూ. 10 రుసుము చెల్లించాలి. ఆర్కే బీచ్ లేదా ఎంవీపీ కాలనీ మీదుగా బీచ్ రోడ్డు ద్వారా ఈ పార్కుకు చేరుకోవచ్చు.
వుడా పార్కు


