
జీఎస్టీ సైకత శిల్పం
భీమునిపట్నం: భీమిలి బీచ్ వద్ద బుధవారం వాణిజ్య పన్నుల శాఖ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీచ్‌లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం పర్యాటకులు, స్థానికులను ఆకట్టుకుంది. ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ప్రొఫెసర్ సింహాచలం పర్యవేక్షణలో విద్యార్థులు దీనిని రూపొందించారు. జీఎస్టీ తగ్గింపు, దాని వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్లు ఉమాశంకర్‌రావు, రాణి రత్నకుమారి, పర్యాటక శాఖాధికారి అశోక్ వివరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, బీచ్‌లో విన్యాసాలు చేశారు.