
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరిట దుష్ప్రచారం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను సైతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నెట్టి కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చేవరకు ప్రజా ఉద్యమాలు నిర్వహించి, ఈ ప్రాంతంలోని విశాఖ స్టీల్ ప్లాంట్, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటాం.
– నీరుకొండ రామచంద్రరావు, స్టీల్ ప్లాంట్ ఉద్యమ నాయకుడు