
వైద్య కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించాలి
సీతంపేట: గత వందేళ్ల రాష్ట్ర చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంతో మాట్లాడి ఒకేసారి 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అన్ని అనుమతులు తేవడం చారిత్రాత్మకమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు అన్నారు. మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చెయ్యాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం హైవే వద్ద మంగళవారం చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే భవిష్యత్‌లో యువత ఎదుర్కొనే ఇబ్బందుల్ని వివరించి, ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌జగన్ మారుమూల ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందేలా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు సాధించారన్నారు. వీటి వల్ల రాష్ట్రంలో అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయని, ఎంతో మంది పేద, మధ్యతరగతి పిల్లలకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ఆశించారన్నారు. ప్రతి మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకల ఆస్పత్రితో ప్రజలకు ఉచితంగా వైద్యం అందేలా కృషి చేశారన్నారు. అమరావతిపై ఖర్చు చేసే రూ.లక్షల కోట్లలో కేవలం రూ.4 వేల కోట్లు వెచ్చిస్తే పెండింగ్‌లో ఉన్న మెడికల్ కళాశాలలన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, దానికి నిదర్శనం కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే అన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు నిర్ణయంపై ప్రజల అభిప్రాయాన్ని సంతకాల రూపంలో సేకరించి గవర్నర్‌కు అందజేయనున్నట్లు వెల్లడించారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు కె.అనిల్‌కుమార్‌రాజు, బర్కత్ ఆలీ, కోఆప్షన్ సభ్యడు సేనాపతి అప్పారావు, వలంటీర్ విభాగం జోనల్ అధ్యక్షుడు ఎం.సునీల్ కుమార్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రాష్ట్ర విద్యార్ధి విభాగం కార్యదర్శి బాణాల తరుణ్‌కుమార్, నీలి రవి, శ్రీదేవి వర్మ, వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, భీశెట్టి ప్రసాద్, హబీబ్, బలిరెడ్డి గోవింద్, కె.సుకుమార్, ఐ.రవికుమార్, మాజీ కార్పొరేటర్ పామేటి బాబ్జి, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు షేక్ బాబ్జి, బాధ శ్రీను, జిల్లా కమిటీనాయకులు సాడి కేశవ్, బోగవిల్లి గోవింద్, జక్కంపూడి సత్యనారాయణ, చిరంజీవి, ఎర్రంశెట్టి శ్రీను, పద్మా శేఖర్, గంగా మహేష్, పారుపల్లి రవి, కె.చిన్న, మహేష్‌బాబు, మహాదాస్య గోపి, మౌనిక, కడితి రమేష్, అనిల్, బషీర్, వెంకటేష్ పాల్గొన్నారు.
కోటి సంతకాల సేకరణలో
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

వైద్య కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించాలి