
అదరగొట్టిన ‘గ్లామ్ రన్ వే’
బీచ్‌రోడ్డు: నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ‘గ్లామ్ రన్ వే’ ..‘డ్యాన్స్ టోపియా’ మెగా ఫైనల్ కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. మూడేళ్ల నుంచి 14 ఏళ్ల వయసున్న చిన్నారులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ర్యాంప్ వాక్ విభాగంలో పిల్లలు ఇండియన్ ట్రెడిషన్, బీచ్, అల్ట్రా స్టైలిష్ వంటి రౌండ్లలో నడిచి మెరిశారు. డ్యాన్స్ టోపియాలో సోలో – గ్రూప్ విభాగాలలో తమ నృత్య ప్రదర్శనలతో వేదికను అదరగొట్టారు. ఈ పోటీలకు హేమలత రెడ్డి, సంతోష్, ప్రీతి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా, అభయ్ అరోరా ప్రత్యేక ప్రదర్శన అలరించింది. విజేతలకు సిరి మెకోవర్స్ సౌమ్య, నైరా గోల్డ్ మనోజ్ అవార్డులు, కిరీటాలు బహూకరించారు. ఈ చిట్టి మోడల్స్‌తో ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందిస్తామని నిర్వాహకులు వీరు మామ తెలిపారు.