విశాఖ స్పోర్ట్స్: టీం ఇండియా భారీ స్కోరు..కంగారూలను కలవరపెట్టడం ఖాయం అనుకున్న అభిమానులకు..ప్రొఫెషనల్ ఆటకు బ్రాండ్ మేమే అన్నట్టు ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగుల వరద సృష్టించారు. భారత బౌలర్లను చీల్చి చెండాడారు. కళ్లు చెదిరే బౌండరీలు..బంతికి చుక్కలు చూపించేలా సిక్సర్లతో మోత మోగించారు. ఆస్ట్రేలియా సారథి అలిస్సా హీలీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. సొగసైన కవర్ డ్రైవ్స్‌లో కళాత్మక బ్యాటింగ్‌తో 142 (107 బంతుల్లో 21 ఫోర్టు, మూడు సిక్సర్లు) చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంది. భారత్ జట్టు 330 పరుగులకు అలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆది నుంచి బౌలర్లపై విరుచుకుపడింది. మధ్యమధ్యలో వికెట్లు పడినా ఏ మాత్రం లక్ష్యాన్ని వీడలేదు. ఆస్ట్రేలియా బ్యాటర్లంతా రాణించడంతో మరో ఓవర్ ఉండగానే విజయం సాధించింది. చివరి వరకు మ్యాచ్ నువ్వా–నేనా అన్నట్టు సాగింది. అటు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించినవారికి..టీవీల్లో చూసిన అభిమానులకు మ్యాచ్ మజా పంచింది. విశాఖ వైఎస్సార్ స్టేడియం ఇరు జట్ల పరుగుల దాహాన్ని తీర్చింది. అభిమానులు ఆటను ఆస్వాదించారు. ఫోర్లు, సిక్సర్లు బాదినప్పుడల్లా మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. అంతకుముందు స్టేడియంలోని ఏ గ్యాలరీ స్టాండ్‌కు భారత మాజీ మహిళా జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ పేరుతోనూ, స్టేడియంలోకి మూడో ప్రవేశద్వారానికి స్థానిక క్రీడాకారిణి రావి కల్పన పేరుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మ్యాచ్‌ను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ , ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష, కార్యదర్వులు కేతినేని శివనాథ్, సానా సతీష్ బాబు వీక్షించారు.
వాటే బ్యాటింగ్...!
వాటే బ్యాటింగ్...!
వాటే బ్యాటింగ్...!
వాటే బ్యాటింగ్...!
వాటే బ్యాటింగ్...!