
అంబుజా సిమెంట్స్‌పై పోరాటానికి కార్యాచరణ
పెదగంట్యాడ: అదానీ అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు స్థానికులతో కలసి పోరాట కమిటీని నియమించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి తెలిపారు. గొందేశి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పెదగంట్యాడలో ఆదివారం సాయంత్రం స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబుజా సిమెంట్స్‌ను ఏర్పాటు చేస్తే జరిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతోపాటు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నామని గుర్తు చేశారు. ప్రజలు వ్యతిరేకించినా మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణను చేపడతామని అధికారులు ప్రకటించడం సరికాదన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పోరాట కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో మార్టుపూడి పరదేశి, పల్లా కార్తీక్, గొందేశి మహేశ్వరరెడ్డి, గొందేశి వెంకటరమణారెడ్డి, మంత్రి శంకరనారాయణ, కొయ్య భారతి, గంట్యాడ గురుమూర్తి, సంపంగి ఈశ్వరరావు, తాటికొండ జగదీష్, మధుసూదన్‌రెడ్డి, సుమన్‌రెడ్డి, నాగు, పిట్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి
అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలని అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. నడుపూరులోని సీడబ్ల్యూసీలో ఆదివారం వ్యతిరేక పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షుడు కృష్ణారావు, సీఐటీయూ నాయకుడు లక్ష్మణమూర్తి, రామారావు, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.