హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను | - | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను

Oct 9 2025 2:37 AM | Updated on Oct 9 2025 2:37 AM

హ్యాట

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను

● నేడు దక్షిణాఫ్రికాతో అమీతుమీ ● విశాఖలో తొలి సమరానికి సర్వం సిద్ధం

విశాఖ స్పోర్ట్స్‌/పీఎంపాలెం: విశాఖ నగరంలో క్రికెట్‌ సందడి నెలకొంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌కు తొలిసారిగా వేదికగా నిలిచిన సందర్భంలో.. నగరం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా.. హ్యాట్రిక్‌ విజయం లక్ష్యంగా భారత జట్టు గురువారం పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. పీఎంపాలెంలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ డే అండ్‌ నైట్‌ వన్డే మ్యాచ్‌ కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రాక్టీస్‌ చేసుకున్నాయి.

విజయోత్సాహంతో బరిలోకి భారత్‌

ప్రస్తుత టోర్నీలో భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంకపై 59 పరుగులు, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 88 పరుగుల భారీ తేడాతో ఘన విజయాలు సాధించింది. విశాఖ వేదికగా అదే జోరును కొనసాగించాలని కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సేన పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌లో హర్లీన్‌(94 పరుగులు), దీప్తి శర్మ (78 పరుగులు), ప్రతీక (68 పరుగులు) సూపర్‌ ఫామ్‌లో ఉండగా, బౌలింగ్‌లోనూ దీప్తి శర్మ (6 వికెట్లు), క్రాంతి, స్నేహ రాణా (చెరో 4 వికెట్లు) ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన విశాఖ పిచ్‌పై వీరు మరింతగా రాణిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

అభిమానుల కోలాహలం

విశాఖ మహిళల ప్రపంచ కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే ప్రప్రథమం. దీంతో నగర క్రీడాభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. భారత్‌, దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ వంటి దిగ్గజ జట్లు ఇక్కడ ఆడనుండటంతో స్టేడియం పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. స్థానిక యువ క్రీడాకారిణులను ప్రోత్సహించే దిశగా స్టేడియంలోని ఒక స్టాండ్‌కు భారత మహిళా క్రికెట్‌ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ పేరు, ఒక ప్రవేశ ద్వారానికి ఆంధ్ర క్రీడాకారిణి కల్పన పేరు పెట్టడం విశేషం. ఇది భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

భారీ బందోబస్తు..

ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల, వెలుపల సుమారు 1,100 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ.. స్టేడియంలో ఉన్న ఆధునిక డ్రైనేజీ వ్యవస్థతో వర్షం నీరు త్వరితగతిన బయటకు వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవనంత వరకు మ్యాచ్‌ ఫలితం తేలే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ప్రాక్టీస్‌ చేస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను1
1/4

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను2
2/4

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను3
3/4

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను4
4/4

హ్యాట్రిక్‌పై భారత్‌ కన్ను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement