
ప్రైవేటు బస్సులపై 14 కేసుల నమోదు
గోపాలపట్నం: దసరా పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేయడం, అనుమతులు లేకుండా నడపడం వంటి పలు నిబంధనల ఉల్లంఘనలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. నాలుగు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 14 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.80,000 జరిమానా విధించినట్టు ఇన్‌చార్జ్ ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.