
సింహాచలం దేవస్థానానికి బ్యాటరీ కారు అందజేత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ బ్యాటరీ కారును వితరణగా అందజేసింది.సుమారు రూ. 8 లక్షలు విలువ చేసే ఈ బ్యాటరీ కారును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఎమ్‌వో శంకర్ సుబ్రహ్మణ్యం సింహగిరిపై దేవస్థానం అధికారులకు అందజేశారు. అనంతరం దేవస్థానం అర్చకులు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ఏఈవో తిరుమలేశ్వరరావు, ఇతర అధికారులు, కోరమాండల్ ప్రతినిధులు పాల్గొన్నారు.