
సమ సమాజమే జాషువా ఆకాంక్ష
సీతంపేట: కవి కోకిల గుర్రం జాషువా కోరుకున్న సమ సమాజ స్థాపనకు అందరం సమష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్స్ హాల్లో జరిగిన జాషువా జయంతి సభలో ఆయన మాట్లాడారు. నాటక రచయితగా రచనా రంగంలో ప్రవేశించిన జాషువా, తన స్వీయ అనుభవాన్ని కవిత్వీకరించడం వల్లే మహాకవి అయ్యారని రామబ్రహ్మం కొనియాడారు. సీ్త్రని కేవలం శృంగార వస్తువుగా చిత్రీకరించే కవిత్వానికి భిన్నంగా, తెలుగు పద్య లోకాన్ని నూతన మార్గంలోకి నడిపించిన ఘనత జాషువాదని ప్రశంసించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, బుల్లయ్య కళాశాల తెలుగు విభాగాధిపతి ఎం.సుబ్బారావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

సమ సమాజమే జాషువా ఆకాంక్ష