
రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి దుర్మరణం
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం పులపర్తి కూడలి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నేవీ ఉద్యోగి పి.రఘురామిరెడ్డి (31) దుర్మరణం పాలయ్యారు. దసరా పండగను కుటుంబంతో ఆనందంగా గడపడానికి విశాఖ నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్‌పై వస్తుండగా.. రోడ్డు దాటుతున్న పాదచారి పులి మల్లికార్జున్ (55)ను తప్పించ బోయి అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రఘురామిరెడ్డికి హెల్మెట్ ఉన్నప్పటికీ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కిలోమీటరు రాయి సైతం విరిగిపోయింది. మల్లికార్జున్ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా, అతనికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి అన్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.