
సమ్మోహనం.. కూచిపూడి నృత్య విన్యాసం
మద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నగరానికి చెందిన సిద్ధేంద్రయోగి కళానిలయం గురు సత్యభాను నృత్య కళాశాల 32వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కూచిపూడి నృత్య విన్యాసం సమ్మోహన భరితంగా సాగింది. కళానిలయం వ్యవస్థాపకురాలు సత్యభాను ఆధ్వర్యంలో 120 మంది నృత్య కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి విద్యతో పాటు సంప్రదాయ కళలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. లెండి ఇంజినీరింగ్ కాలేజీ చైర్మన్ పి. మధుసూదన రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కళాశాలల్లో శాసీ్త్రయ కళల గురువులను నామినేట్ చేసేందుకు ఇటీవల జీవో కూడా విడుదల చేసిందని, ఇది విద్యార్థులకు సంప్రదాయ నృత్యాలు అభ్యసించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డా. శ్రీధర్ మిత్ర, కన్నం నాయుడు, కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపల్ గురు హరి రామమూర్తి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
120 మందితో కూచిపూడి నృత్యం
కూచిపూడి నృత్యం రూపకం