
సంతానలక్ష్మిగా కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం కనకమహాలక్ష్మి సంతానలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కలువపూలతో సహస్రనామార్చన నిర్వహించారు. అలంకరణకు నగరానికి చెందిన పి సంతోష్‌కుమార్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ సింగపూర్ కో కన్వీనర్) డాక్టర్ వెంకట పద్మజ దంపతులు, ఏలూరుకు చెందిన ఆర్.రాంబాబు, వెంకటనాగలక్ష్మీ దంపతులు రూ.45వేలు చెల్లించి పూజలో కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ నవాజ్‌కు బహుమతి
బీచ్‌రోడ్డు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఇటీవల పర్యాటక శాఖ నిర్వహించిన వీడియో, ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలకు శనివారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ బహుమతులు అందజేశారు. ఫొటోగ్రఫీ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ నవాజ్‌కు కలెక్టర్ ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు.

సంతానలక్ష్మిగా కనకమహాలక్ష్మి