రూ.100 కోట్ల విలువైన భూమి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల విలువైన భూమి స్వాధీనం

Sep 28 2025 6:52 AM | Updated on Sep 28 2025 6:52 AM

రూ.100 కోట్ల విలువైన భూమి స్వాధీనం

రూ.100 కోట్ల విలువైన భూమి స్వాధీనం

మధురవాడ: మధురవాడ ఐటీ సెజ్‌ జంక్షన్‌, మానం ఆంజనేయులు కాలనీకి సమీపంలోని సుమారు రూ.100 కోట్ల విలువ చేసే భూమిని శనివారం వీఎంఆర్డీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్‌ 126/4లో సుమారు 3 ఎకరాల విస్తీర్ణం గల డీ–ఫారం భూమి ఉంది. వీఎంఆర్డీఏ ఎస్టేట్‌ ఆఫీసర్‌ దయానిధి, డిప్యూటీ ఈఈ సుధీర్‌, డిప్యూటీ డీఈ శిరీష, ఏఈ శర్మ తదితరులు పోలీసుల బందోబస్తు మధ్య ప్రైవేట్‌ వ్యక్తి ఆధీనంలో ఉన్న ఈ భూమిని స్వాధీనం చేసుకుని, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ భూమిలో లెవెలింగ్‌, ఫెన్సింగ్‌ పనులు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement