
ఏయూ ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్‌కు అరుదైన గౌరవం
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ మేకా జేమ్స్ స్టీఫెన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అమెరికా ప్రభుత్వం నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక ‘ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ (ఐవీఎల్‌పీ)’లో పాల్గొనేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 18వ వరకు యూఎస్‌లో జరిగే ఈ కార్యక్రమానికి భారత్ నుంచి ఏకై క ప్రతినిధిగా ప్రొఫెసర్ స్టీఫెన్ పాల్గొననున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల నుంచి కేవలం 25 మందిని మాత్రమే ఎంపిక చేసిన ఈ కార్యక్రమంలో ఆయన అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, కాలిఫోర్నియా, ఆరిజోనా, నార్త్‌కరొలీనా రాష్ట్రాలను సందర్శించి ‘యూనివర్సిటీ ఎంగేజ్‌మెంట్’ అంశంపై వివిధ సదస్సులలో దేశం తరఫున ప్రసంగాలు అందించనున్నారు. అదే విధంగా ఎంపికై న 25 మందికి అమెరికా ప్రభుత్వ అతిథులుగా ఆహ్వానిస్తూ ప్రత్యేక వీసాను సైతం మంజూరు చేసింది.