
కూటమి కక్ష
బడ్డీల తొలగింపుతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు నష్టపరిహారంతోపాటు బడ్డీలకు అనుమతులు ఇవ్వాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు డిమాండ్ చిరు వ్యాపారులకు అండగా వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ
విశాఖపట్నం
చిరు వ్యాపారులపై
7
బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
75 కేసుల్లో 103 మంది
నిందితుల అరెస్ట్
బీచ్‌రోడ్డు : చిరు వ్యాపారుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కనీసం నోటీసులు ఇవ్వకుండా వారి దుకాణాలను తొలగించడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తోపుడు బళ్లు, బడ్డీల తొలగింపును నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, హాకర్లతో కలిసి మంగళవారం ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ వద్ద ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. అయినా వైఎస్సార్ సీపీ శ్రేణులు, హాకర్లు తమ ఆందోళనను కొనసాగించారు. ర్యాలీ అనంతరం బడ్డీలు, తోపుడు బళ్ల వ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జీవీఎంసీ అదనపు కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మీడియాతో మాట్లాడుతూ గతంలో ట్రేడ్ లైసెన్స్, విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇచ్చి హాకర్ జోన్లలో వ్యాపారాలను ప్రోత్సహించిన ఇదే జీవీఎంసీ అధికారులు ప్రభుత్వం మారగానే కుట్ర పూరితంగా దుకాణాలను తొలగించడం దుర్మార్గమన్నారు. జీవీఎంసీ అధికారుల దాడుల్లో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు తక్షణం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మేయర్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు.
నాడు అనుమతులిచ్చి నేడు కూల్చేస్తారా..?
చిరు వ్యాపారాలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఉన్నపళంగా దుకాణాలు కూల్చివేస్తే ఎలా?.. వారు ఎక్కడికి పోవాలి? కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉన్న జీవీఎంసీ కమిషనర్లే హాకర్ జోన్ల పేరుతో స్థలాలు కేటాయించి నంబరింగ్, ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి వ్యాపారాలను ప్రోత్సహిస్తే ఇప్పుడు ఉన్న కమిషనర్ కర్కశంగా వాటిని తొలగించేశారన్నారు.
రోడ్డున పడ్డ 40 వేల కుటుంబాలు
ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా నగరంలో దాదాపు 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. డైలీ ఫైనాన్స్, ముద్ర లోన్స్ తీసుకొని వ్యాపారులు చేసుకుంటున్న వారంతా ఇప్పుడు లోన్లు కట్టేదారి లేక అల్లాడిపోతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
చేతనైతే భూ కబ్జాలను అడ్డుకోండి..
కూటమి ప్రభుత్వానికి చేతనైతే నగరంలో బడాబాబులు చేస్తున్న అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలను అడ్డుకోవాలని కానీప రెక్కాడితే గానీ డొక్కాడని చిరువ్యాపారులపై విరుచుకుపడటం దుర్మార్గమన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలను క్షోభకు గురిచేయడం సరికాదన్నారు. కూటమి ఎమ్మెల్యేలు చిరువ్యాపారులకు క్షమాపణలు చెప్పి వారి దుకాణాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విశాఖను పణంగా పెడుతున్నారు..
విశాఖ అభివృద్ధి చెందితే అమరావతికి పెట్టుబడులు రావనే ఆలోచనతో కుట్రపూరితంగా నిత్యం నగరంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కె.కె.రాజు ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను ఇక్కడ నుంచి వెనక్కి పంపే కుట్ర జరుగుతోందన్నారు. ఇక్కడి సంపదను అమరావతికి తరలించుకుపోతున్నారన్నారు. ఇక్కడి భూములను తనఖా పెట్టి బ్యాంకు లోన్లు తీసుకుని అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయచంద్ర, పార్టీ సీనియర్ నాయుకులు రొంగలి జగన్నాథం, డాక్టర్ జహీర్ అహ్మద్, గొలగాని శ్రీనివాస్, పిన్నమరాజు సతీష్ వర్మ, నడింపల్లి కృష్ణంరాజు, కటారి అనిల్‌కుమార్‌రాజు, అల్లు శంకర్‌రావు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, రవి రాజు, పల్లా చినతల్లి, అల్లంపల్లి రాజబాబు, రామన్న పాత్రుడు, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు అంబటి శైలేష్, నీలపు కాళిదాస్ రెడ్డి, ముత్తి సునీల్ కుమార్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సకలభక్తుల ప్రసాద్ రావు, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పీలా ప్రేమకిరణ్ జగదీష్, రామి రెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, జీలకర్ర నాగేంద్ర, నీలి రవి, దేవరకొండ మార్కెండేయులు, కార్పొరేటర్ గులివిందల లావణ్య, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, చిరువ్యాపారులు పాల్గొన్నారు.
విశాఖ సిటీ : నగరంలో నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆగస్టు నెలలో నగరంలో 105 చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 75 కేసులు ఛేదించి 103 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.5,70,500 , 557.392 గ్రాముల బంగారం, 18 బైక్‌లు, 423 మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తంగా రూ.1,21,24,953 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. నేర నియంత్రణలో భాగంగా ఆగస్టులో నగరంలో 247 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రి, పగలు ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం పోలీసులు రికవరీ చేసిన సొత్తు, వస్తువులను సీపీ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీ(కై మ్) లతామాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పశు సంవర్ధక శాఖ జేడీగా
శంకరరావు
కూటమి ప్రభుత్వం
ముంచేసింది
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిరు వ్యాపారాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వైఎస్సార్ చేదోడు, చేయూత పథకాలు అమలు చేస్తే కూటమి ప్రభుత్వం మా బతుకులను బజారుకీడ్చింది. సీతమ్మధారలో కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న టిఫిన్ షాపును తొలగించటంతో కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది.
– నారాయణ రావు, టిఫిన్ షాపు, సీతమ్మధార
వృద్ధాప్యంలో ఇన్ని కష్టాలా?
గత 30 ఏళ్లగా కూరగాయాల వ్యాపారం చేసుకుంటూ ఒంటరి జీవితం కొనసాగిస్తున్నా. దుకాణాలు తొలగింపుతో జీవనాధారం లేకుండా పోయింది. ఈ వయసులో ఇతర పనులకు వెళ్లాలేని పరిస్థితి. ఎలా బతకాలో ఆందోళనగా ఉంది. ప్రభుత్వం చిరు వ్యాపారులను ఆర్థికంగా దెబ్బతీసింది.
– ఎల్లాయ్యమ్మ,
వృద్ధురాలు, దొండపర్తి
రోడ్డున పడ్డాం..
నా భార్య, కుమారుడు దివ్యాంగులు. కుటుంబమంతా కలిసి పకోడీ షాపు ద్వారా జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు షాపు తొలగించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం చర్యలతో వీధినపడ్డాం.
– వెంకట రమణ,
పకోడి షాపు, కృష్ణకాలేజ్ రోడ్డు
ఆరిలోవ: విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డెరెక్టర్‌గా డాక్టర్ దేవులపల్లి శంకరరావు బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఇంతవరకు పనిచేసిన ఆయనకు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఇంతవరకు ఇక్కడ స్మైల్ విభాగానికి చెందిన డాక్టర్ కరుణాకరరావు జేడీ(ఎఫ్‌ఏసీ)గా పనిచేసి సోమవారం రిలీవై డాక్టర్ శంకరరావుకు బాధ్యతలు అప్పగించారు.

కూటమి కక్ష

కూటమి కక్ష

కూటమి కక్ష

కూటమి కక్ష

కూటమి కక్ష

కూటమి కక్ష

కూటమి కక్ష

కూటమి కక్ష

కూటమి కక్ష

కూటమి కక్ష