
● గజ్జె ఘల్లుమన్నది.. జానపదం వెల్లివిరిసింది
గజ్జఘల్లుమన్నది...జానపదం వెల్లివిరిసింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న రెండు రోజుల యువజనోత్సవంలో విద్యార్థినులు నృత్యాలతో అలరించారు. మంగళవారం నిర్వహించిన నృత్య పోటీలకు పెద్దసంఖ్యలో యువత పోటీ పడ్డారు. శాసీ్త్రయ, జానపద నృత్యాలతో తమ ప్రతిభను చాటారు. అధిక శాతం మంది గ్రామీణనేపథ్యం కలిగిన జానపద నృత్యాలను ప్రదర్శించడానికి ఆసక్తి చూపారు. బృందాలుగా వీరు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువత ముందుగా ఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారిపై తమ నృత్యం సాధన చేశారు.
–ఫొటోలు : సాక్షి ఫొటో గ్రాఫర్, విశాఖపట్నం

● గజ్జె ఘల్లుమన్నది.. జానపదం వెల్లివిరిసింది

● గజ్జె ఘల్లుమన్నది.. జానపదం వెల్లివిరిసింది